సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 June 2022

సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు


శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. ముంబైలోని ఓ భవన సముదాయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో రేపు విచారణకు రావాలని ఆదేశించింది. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనను దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారించనున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలో శివసేనకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంపుకు తరలివెళ్ళి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు పంపడం గమనార్హం. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్‌తో పాటు ఆయన ఇద్దరు అనుచరులకు సంబంధించిన రూ.11.15 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈడీని వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను అణచివేస్తోందని ఆరోపణలు వస్తోన్న వేళ సంజయ్ రౌత్‌కు కూడా సమన్లు అందడం గమనార్హం. ఈ పరిణామం పట్ల శివసేన నేతలు మండిపడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు.

No comments:

Post a Comment