కేసీఆర్ కు భట్టి విక్రమార్క హెచ్చరిక ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 9 June 2022

కేసీఆర్ కు భట్టి విక్రమార్క హెచ్చరిక !


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి  పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొదలు పెట్టిన పాదయాత్ర గురువారం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చేరుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించి అంకమ్మ దేవాలయాన్ని పున:ప్రారంభం చేశారు. గ్రామంలోని ప్రజల సమస్యలను వింటూ పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూనే.. టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రకటించారు. దీంతో పాటు రైతు కూలీలకు రూ.12,000 ఇస్తామన్నారు. వరికి బోనస్ ప్రకటించి రూ. 2500లకు కొంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలరకు పంచిన భూములను ప్రభుత్వం వెనక్కి లాక్కుంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు చేస్తున్నావ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఖ్యాతి ఉన్నా కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా తెలంగాణలోకి అధికారంలోకి రాలేదు. గత రెండు పర్యాయాలుగా ప్రతిపక్షానికే పరిమితం అయింది. ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని, తెలంగాణలోకి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రధాన పార్టీలు తమ ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు చేస్తోంది. ఇటీవల వరంగల్ సభకు రాహుల్ గాంధీ రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడం చూస్తే మెయిన్ టార్గెట్ అధికారమే అని తెలుస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ను తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు వివరించేం'రైతు రచ్చబండ' కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. దీంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు.

No comments:

Post a Comment