మాతృభాషలోనే చదివి ఈ స్థాయికి ఎదిగాను

Telugu Lo Computer
0


తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా అధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.." తెలుగు ప్రజల్లో నేను ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నా. అమెరికాలో తెలుగు తల్లి ముద్దు బిడ్డలగా ఉన్న వారందరిని ఈరోజు కలవడం ఎంతో సంతోషంగా ఉంది. అమెరికాలో తెలుగువారు సంపద సృష్టిస్తున్నారని చెప్పడం గర్వకారణం. తెలుగు అనేది కేవలం భాష కాదు. జీవన విధానం. మాతృభాష, మాతృభూమిలో ఉన్న ప్రేమను ఆస్వాదించాలి. మన భాషతో పాటు పరాయి భాషనూ గౌరవించాలి. మాతృభాష, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత. అమ్మభాషలోని తియ్యదనాన్ని అనుభవించాల్సిందే. మాటల్లో చెప్పలేం. ఇంట్లో పిల్లలతో పెద్దలు తెలుగులో మాట్లాడాలని కోరుతున్నా. తెలుగు సదస్సులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి" అని ఆయన అన్నారు. మాతృభాషలోనే  చదివి నేను ఈ స్థాయికి ఎదిగాను. లా మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో చదివా. మన తెలుగు భాష, సంస్కృతి మరచిపోతే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి రావడం బాధగా ఉంది. మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది కేవలం అపోహ మాత్రమే. నేను మాతృభాషలో చదివే ఈ స్థాయికి వచ్చాననేది మాత్రం మర్చిపోవద్దు. జాషువా, దాశరథి, శ్రీశ్రీ వంటి మహానుభావులు వెలకట్టలేని సంపద ఇచ్చారు. తెలుగు కళారంగాన్ని ప్రభావితం చేసిన ఎన్టీఆర్ శతజయంతి ప్రారంభమైంది" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)