గోవాలో సావో జావో వేడుకలు !

Telugu Lo Computer
0


గోవా రాష్ట్రంలో ప్రజలు ప్రసిద్ధ పండుగ అయిన సావో జావో ను వైభవంగా జరుపుకున్నారు. గోవా వాసులు ఈ పండుగ సందర్భంగా బావులు, చెరువులు ఇతర నీటి వనరుల వద్దకు తరలివచ్చారు.కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ వేడుకలు నిలిపివేశారు.కరోనా తగ్గిందని ఈ సంవత్సరం ఉత్సవాలు వైభవంగా జరిపారు. సెయింట్ జాన్ బాప్టిస్ట్ విందును సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గోవా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలవనరుల్లో స్నానమాచరించారు. రంగు రంగుల, థీమ్‌లు కూడా ఉత్సవాల్లో సంప్రదాయంగా నిలిచాయి.ప్రజలు పూలు, పండ్ల కిరీటాలను ధరించి పడవలపై రంగురంగుల తేలియాడుతున్న దృశ్యాలు కనువిందు చేశాయి. వివా సావో జావో అరుస్తూ జలాశయాల్లోకి దూకడం ఒకప్పటి పోర్చుగీసు పాలనలో పండుగ సంప్రదాయం.ఉత్తర గోవాలోని సియోలిమ్ అనే గ్రామం సావో జావో సందర్భంగా సంప్రదాయ పడవ పరేడ్‌ని నిర్వహించారు.రంగుల పడవ పరేడ్‌ను చూసేందుకు వందలాదిమంది స్థానికులు, పర్యాటకులు సియోలిమ్ కు వచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)