ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయి !

Telugu Lo Computer
0


సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌  పథకంపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే.. పథకం అమలు కాకముందే వివాదాన్ని రేపుతున్నాయని ఆరోపించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్‌ ఈ విధంగా స్పందించారు. 'అభ్యర్థులు కొన్ని షరతులకు లోబడే ఆర్మీతోపాటు  ఇతర భద్రతా దళాల్లో ఉద్యోగం పొందుతారు. ఈ క్రమంలో చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే.. వారిలో 25శాతం మంది సర్వీసుల్లోకి వెళ్తారు. మిగతా వారికి మంచి ఆర్థిక ప్యాకేజీ లభిస్తుంది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చాయి' అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 'ఈ పథకంలో ఎటువంటి వివాదాస్పద విషయాలు లేవు. గత్యంతరం లేకనే ప్రతిపక్షాలు అనవసరంగా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వారిని ఈడీ చుట్టుముట్టింది. వీటిపై ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. ఇంకా ఆ పథకం అమలు కాకముందే వివాదమెక్కడిది..? అని ఆర్మీ మాజీ చీఫ్‌ ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)