కాన్పూర్‌లో ఉద్రిక్తత - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 3 June 2022

కాన్పూర్‌లో ఉద్రిక్తత


మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక వర్గం మత పెద్దలు ఇచ్చిన బంద్ ఉద్రిక్తంగా మారింది. బంద్ సందర్భంగా దుకాణాల మూసివేతపై వివాదం చెలరేగడంతో కాన్పూర్ లో ఘర్షణలు చెలరేగాయి. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు వ్యక్తులు గాయపడగా కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. బీజేపీ నేత నూపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాన్పూర్ లోని బేగంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధి నయీ సడక్ లో స్థానిక ముస్లిం సంఘం అధ్యక్షుడు జాఫర్ హయత్ హష్మీ బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ లో భాగంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలోని మార్కెట్లను మూసివేయాలని ప్రకటించగా అందుకు కొందరు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. మార్కెట్ మూసివేయడానికి సిద్ధములేని కొందరు వ్యాపారులు బంద్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చిన వారికీ వ్యతిరేకత వ్యక్తం చేసిన వారికీ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సాయుధ దళ సిబ్బందితో సహా అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాన్పూర్ శాంతిభద్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చామని, అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఈఘటన అనంతరం ఇప్పటి వరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆందోళనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరి కొందరు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘర్షణల వెనుక సూత్రధారి జాఫర్ హయత్ హష్మీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments:

Post a Comment