పాఠశాల మరుగుదొడ్లో చిక్కుకున్న చిరుత

Telugu Lo Computer
0


ముంబైలోని గురుగావ్ ఈస్ట్‌లోని బింబిసార్ నగర్‌లో ఉన్న బీఎంసీ స్కూలులో గేటు దూకి లోపలకు ప్రవేశించిన ఓ చిరుతపులి  మరుగుదొడ్లో చిక్కుకుపోయింది. పాఠశాల సమీపంలో అడవులను తలపించే దట్టమైన వృక్షాలు ఉన్నాయని, మంగళవారం రాత్రి స్కూలు క్యాంపస్‌లోకి వచ్చిన చిరుతపులి వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి అక్కడే చిక్కుకుపోయిందని అటవీ శాఖ అధికారి గిరిరాజ దేశాయ్ తెలిపారు. వాచ్‌మన్ ఇచ్చిన సమాచారంతో ముంబై అటవీ శాఖ సిబ్బంది, ఎన్‌జీఎన్‌పీ రెస్క్యూ టీమ్, వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందన్నారు. చిరుతను సురక్షితంగా కాపాండేందుకు మూడు గంటలు పట్టిందని చెప్పారు. చిరుతపై ట్రాంక్వలైజర్‌ ఉపయోగించి, అది మత్తులోకి రాగానే సురక్షితంగా బయటకు తెచ్చి, అటవీ శాఖ వాహనంలో అక్కడి నుంచి తరలించినట్టు వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)