దమ్ముంటే రా.. తేల్చుకుందాం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 2 June 2022

దమ్ముంటే రా.. తేల్చుకుందాం !


తెలంగాణలో రెండో విడుత పాదయాత్ర పూర్తిచేసుకున్న బండి సంజయ్.. ఈ పాదయాత్ర ముగింపు సభలో అమిత్ షా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన సంజయ్ రాష్ట్రంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత రేణక చౌదరి బండిసంజయ్ పై ఫైర్ అయ్యారు. సంజయ్ ఖబర్దార్.. ఎక్కవ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదని రేణుక చౌదరి హెచ్చరించారు. జంట నగరాల్లో బీజేపీ మత చిచ్చు రగల్చాలి అనుకుంటే అది భ్రమ మాత్రమే. చార్మినార్ ఒక మతానికి, ధర్మానికి సంబంధించినది కాదని విరుచకుపడ్డారు. చార్మినార్ హైదరాబాద్ ప్రజలది.. నేను ఒంటరిగా చార్మినార్ వస్తా, దమ్ముంటే రా తేల్చుకుందామని సవాల్ విసిరారు రేణుక చౌదరి. బీజేపీ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని.. భయపెడితే భయపడే వాళ్ళం కాదని.. మా దమ్ము ఏంటో చూపిస్తాం అంటూ హెచ్చరించారు. 

No comments:

Post a Comment