నాలుగు రోజులుగా పాముతో మహిళ సహజీవనం!

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా బనహట్టి తాలుకా కులహళ్లి గ్రామంలో శారవ్వ కంబార అనే మహిళ జీవిస్తోంది. రెండేళ్లక్రితం ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగానే ఇంట్లో ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఇంట్లోకి ఓ పాము వచ్చింది. చనిపోయిన భర్తే పామురూపంలో వచ్చాడంటూ శారమ్మ పాము విషయం ఎవ్వరికీ చెప్పలేదు. నాలుగు రోజులు గడిచాక ఒక రోజు పక్కింటి వారు ఏదో పనిమీద శారవ్వ ఇంటికి వచ్చినపుడు నల్లటి తాచుపామును చూసి ఉలిక్కిపడ్డారు. ఇదే విషయం శారవ్వకు చెప్పగా, నాలుగు రోజులుగా పాము తన వద్ద ఉందనీ, ఎవరినీ ఏమీ చేయదనీ, చంపొద్దని వేడుకుంది. అయితే, చుట్టుపక్కలవారు శారవ్వను బుజ్జగించి, పామును ఓ సంచిలో బంధించి సమీపంలోని అడవిలో వదిలేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)