ఉదయపూర్ హత్యపై ఎన్ఐఏ విచారణకు ఆదేశం

Telugu Lo Computer
0


రాజస్తాన్ లోని ఉదయపూర్‌లో నిన్న జరిగిన టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య ఘటన దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కన్హయ్య లాల్ తేలి దారుణ హత్య కేసు కేసులో అంతర్జాతీయ లింక్‌ల ప్రమేయాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అధికారులను కోరారు.దారుణమైన హత్యోదంతంపై రాష్ట్రంలో వ్యక్తమైన ఆగ్రహంతో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి.దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు. ఉదయపూర్ నగరంలోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కర్ఫ్యూ విధించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఉదయ్‌పూర్ ఘటనపై ఇవాళ రాజస్థాన్ సీఎం సమావేశం కానున్నారు.ఉదయ్‌పూర్ హత్య ఘటనపై చర్చించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు. జైపూర్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగింది.పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ట్విట్టర్‌లో ఇలా రాశారు.'' ఉదయపూర్‌కు చెందిన కన్హయ్య లాల్‌కు నా నివాళులు అర్పిస్తున్నాను,అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను'' అని సువేందు పోస్టు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)