ఫడ్నవీస్‌తో షిండే భేటీ

Telugu Lo Computer
0



బీజేపీ నేత ఫడ్నవీస్‌తో షిండే భేటీ అయినట్టు తెలుస్తోంది. వారిద్దరూ ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాచుకున్నారు. గత రాత్రి గుజరాత్ వడొదరలో ఇద్దరు కలిసినట్టు సమాచారం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. అయితే ఆ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అక్కడే ఉన్నారు. అయితే ఆయన సమావేశంలో పాల్గొన్నారా లేదా అనే అంశం స్పష్టత లేదు. ఉద్దవ్ పదవీ చేపట్టేవరకు మహారాష్ట్రలో ఫడ్నవీస్ సీఎంగా ఉన్నారు. ఇటు ఉద్దవ్, అటు షిండే బెట్టు దిగడం లేదు. దీంతో ఏకాభిప్రాయం కుదరడం లేదు. షిండే వర్గం ఎమ్మెల్యేలు గువహటిలోని హోటల్‌లోనే ఉన్నారు. ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అదీ ప్రాక్టికల్‌గా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలీ. అన్నీ లెక్కలు వేసుకున్నాకే పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారు. మరోవైపు సంజయ్ రౌత్.. షిండే.. అతని వర్గం ఎమ్మెల్యేలు బాల్ థాకరే పేరు వాడొద్దని సూచించారు. అంతకుముందు వర్షను వదిలి వెళుతున్నందుకు బాధపడటం లేదని సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. ఇదీ తనది కాదని తనకు తెలుసు అని చెప్పారు. ఇదివరకు చాలా మంది కూడా అలాగే వెళ్లారని గుర్తుచేశారు. తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. తనతో శివ సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు కూటమికి మద్దతును ఉపసంహరించుకోలేదని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)