స్పైస్‌జెట్‌కు రూ.10 లక్షల జరిమానా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 6 June 2022

స్పైస్‌జెట్‌కు రూ.10 లక్షల జరిమానా


స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది. తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ ఇచ్చినందుకు మే 30న ఈ మేరకు జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్‌ దీనిపై సోమవారం వివరణ ఇచ్చింది. మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నడిపేందుకు 650 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. అయితే 90 మంది పైలట్లు తప్పుడు సిమ్యులేటర్లపై శిక్షణ పొందినట్లుగా డీజీసీఏ గమనించినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ సూచనల మేరకు ఈ 90 మంది పైలట్లను మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నడపకుండా నిరోధించినట్లు పేర్కొంది. ఈ 90 మంది పైలట్లకు సరైన సిమ్యులేటర్లపై మళ్లీ శిక్షణ ఇస్తామని స్పైస్‌జెట్‌ వివరించింది. వీరి శిక్షణపై డీజీసీఏ సంతృప్తి చెందితే మాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. ఈ చర్య వల్ల మాక్స్‌ విమానాల ఆపరేషన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పైస్‌జెట్‌ తెలిపింది. తగినంత శిక్షణ పొందిన పైలట్లు సంస్థకు అందుబాటులో ఉన్నారని పేర్కొంది.

No comments:

Post a Comment