రేషన్‌ డీలర్ల నిరసనబాట !

Telugu Lo Computer
0


జాతీయ రేషన్‌ డీలర్ల ఫెడరేషన్‌ గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని నిర్ణయించినట్లు జాతీయ రేషన్‌ డీలర్ల ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'వన్‌ నేషన్‌-వన్‌ కమీషన్‌' విధానంలో ప్రతి క్వింటాల్‌కు కమీషన్‌ను రూ.250 నుంచి రూ.300కు పెంచాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 4న మండల కేంద్రాల్లో, జూలై 11న జిల్లా కేంద్రాల్లో, జూలై 18న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానుల్లో ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్ట్‌ 2న దేశవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది డీలర్లతో ఢిల్లీలో పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు రాజు పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)