టోయింగ్‌ వాహనానికి మంటలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 4 June 2022

టోయింగ్‌ వాహనానికి మంటలు !


ఢిల్లీ విమానాశ్రయంలో కార్గో బేలో విమానాల పార్కింగ్‌ కోసం వినియోగించే టోయింగ్‌ వాహనంలో మంటలు వ్యాపించాయి. గమనించిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఫైర్‌ ఇంజిన్‌ ద్వారా మంటలను అదుపు చేశారు. ఆ టోయింగ్‌ వాహనం పలు పెద్ద విమానాల సమీపంలో ఉన్నది. మంటలను నియంత్రించడంతో సమీపంలోని భారీ కార్గో విమానాలకు ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. టోయింగ్‌ వాహనంలో మంటలు వ్యాపించిన సంఘటనను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ధృవీకరించారు. దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే విమాన కార్గో విభాగం కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

No comments:

Post a Comment