కరోనా వైరస్ పట్ల తస్మాత్ జాగ్రత !

Telugu Lo Computer
0


కరోనా వైరస్ ఇంకా పోలేదు, మన చుట్టూ ఉన్న గాలిలో దాని ఆనవాళ్లు ఉన్నాయి. అందుకే రోజుకు మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి బలమైన సంకేతాలుగా దగ్గు, జ్వరం, వాసన, రుచి శక్తి కోల్పోవడాన్ని సూచిస్తారు. ఇవే ముఖ్యమైన సంకేతాలుగా భావిస్తారు. కాని కరోనా కొన్ని ప్రత్యేకమైన ముందస్తు లక్షణాలను కూడా చూపిస్తుంది. కానీ వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. శరీరంలో వైరస్ ముదిరి దగ్గు, జ్వరం లాంటివి మొదలయ్యాకే అది కోవిడ్ ఏమో అని ఆలోచిస్తారు. ఇప్పుడు కొన్ని కొత్త లక్షణాలు బయటపడ్డాయి. వీటిని కూడా కోవిడ్ ముందస్తు సంకేతాలుగా భావించాల్సిందే. చాలా మంది తలనొప్పిని తేలికగా తీసుకుంటారు. తరచూ వచ్చేదే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ తలనొప్పి కూడా కోవిడ్ ప్రారంభ లక్షణమే. తొలి దశలో వచ్చే లక్షణాలలో తలనొప్పి ఒకటి. ఇది కోవిడ్ సోకిన తొలి రోజుల్లోనే కనిపిస్తుంది. సాధారణంగా మూడు నుంచి అయిదు రోజుల వరకు ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా వచ్చే తలనొప్పి మధ్యస్థంగా నుంచి తీవ్రంగా మారుతుంది. తలపై కొడుతున్నట్టు, నొక్కుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఈ తలనొప్పి ఒక వైపే కాకుండా రెండు వైపులా వస్తుంది. కొందరిలో ఇది కరోనా వైరస్ వల్ల కలిగే దీర్ఘకాలిక లక్షణంగా మారుతుంది. కాబట్టి తలనొప్పి వదలకుండా వేధిస్తుంటే టెస్టు చేయించుకోవడం మంచిది. కండరాలలో నొప్పి కలగడం కూడా కరోనా వైరస్ తాలూకు ప్రారంభ సంకేతమనే చెప్పకోవాలి. కాలి కండరాలు, చేయి కండరాలు నొప్పి పెడతాయి. ఇది ముఖ్యంగ ఒమిక్రాన్ వేవ్ లో కనిపించ లక్షణం. కండరాల నొప్పులు తేలికగా వస్తాయి. కాలి కండరాలు, చేయి కండరాలు బలహీనంగా మారినట్టు అనిపిస్తాయి. కొందరిలో రోజువారి పనులు చేసుకోలేని విధంగా నొప్పి పెడతాయి. ఈ కండరాల నొప్పి వస్తే రెండు నుంచి మూడు రోజుల పాటూ ఉంటుంది. అదే ముసలివారికైనా ఎక్కువ కాలం పాటు వేధిస్తుంది. ఇది కూడా లాంగ్ కోవిడ్ సంకేతంగా మారవచ్చు. ఈ రెండు లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. అంతేకాదు ఈ రెండూ కోవిడ్ లక్షణాలని కూడా ప్రజలకు అవగాహన లేదు. తలనొప్పి, కండరాల నొప్పి బాధిస్తున్నప్పుడు కోవిడ్ టెస్టు చేయించుకోవడం ఉత్తమం. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులు. అవి చెడిపోతే ప్రాణానికే ప్రమాదం. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ముందస్తు లక్షణాలను తేలికగా తీసుకోకుండా ముందు జాగ్రత్తలు పాటించండి.

Post a Comment

0Comments

Post a Comment (0)