జగన్నాథ రథయాత్రకు ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ప్యాకేజీ !

Telugu Lo Computer
0


దేశంలోని ప్రసిద్ధ, పముఖ దేవాలయాల్లో ఒకటైన పూరీ జగన్నాథుడి ఆలయం. ఈ ఆలయాన్ని ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శిస్తూ వస్తుంటారు. ప్రతి సంవత్సరం జూలై మాసంలో జగన్నాథుడి యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది జూలై 1న రథయాత్ర ప్రారంభం కానున్నది. సోదరుడు భలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు రథయాత్ర బయలుదేరనున్నారు. యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ.. 'జగన్నాథ్‌ యాత్ర కార్‌ ఫెస్టివల్‌ ప్యాకేజీ' తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచి ప్యాకేజీ ప్రారంభం కానున్నది. భువనేశ్వర్‌, పూరి, కోణార్క్‌లో పర్యటించి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. జగన్నాథ్‌ యాత్ర టూర్‌ ప్యాకేజీ రెండు రాత్రులు, మూడు రోజుల పాటు కొనసాగనున్నది. మూడు రోజుల ప్యాకేజీలో విమాన ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంచింది. ప్రయాణికులు హైదరాబాద్ నుంచి విమానంలో భువనేశ్వర్ వెళ్లి.. పూరీలోలో ఏసీ హోటల్‌లో బస కల్పిస్తారు. అలాగే ఏసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రథయాత్ర కార్ ఫెస్టివల్ ప్రత్యేక ప్యాకేజీని బుక్ చేసుకునేందుకు ఒక్కో వ్యక్తికి రూ.28,555 ఖర్చవుతుంది. ఇద్దరు వ్యక్తులు ప్యాకేజీని బుక్‌ చేసుకుంటే రాయితీపై ఒక్కో వ్యక్తికి రూ.20,525 టికెట్‌ లభించనుండగా.. ముగ్గురికి ప్యాకేజీలో రూ.18,115కి తగ్గనున్నది. పిల్లలకు ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)