మధుమేహం - మాంసాహారం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 June 2022

మధుమేహం - మాంసాహారం


మధుమేహం అనేది చాలా సాధారణమైపోయింది. ఇది ఒక వ్యక్తి శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్‌ను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరిగే రుగ్మత. మధుమేహం ఉన్నవారికి వారి దిన చర్యలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా అవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు కనీసం కార్బోహైడ్రేట్లు, సంతృప్త ఫ్యాట్ ఫుడ్‌ను తీసుకోవాలి. మధుమేహం, గుండె జబ్బులు ఉన్న రోగులు రెడ్ మీట్ వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇందులో ఉండే బ్యాడ్ ఫ్యాట్ గుండె జబ్బులకు కారణమవుతుంది. రెడ్ మీట్‌లో పంది మాంసం, గొడ్డు మాంసం, మేక , గొర్రె మాంసం ఉన్నాయి. వీటిలో మేక లేదా గొర్రె మటన్ మన దేశంలో ఎక్కువగా ఇష్టపడే రెడ్ మీట్. ఐరన్, జింక్, ఫాస్పరస్, రైబోఫ్లావిన్, థయామిన్, విటమిన్ బి12 మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నందున చాలా ఇష్టపడతారు. రెడ్ మీట్‌లోని సోడియం, నైట్రేట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతాయి. ఇది శరీరంలో మంటను కూడా పెంచుతాయి. ఇది కొన్ని రకాల క్యాన్సర్లకు దారి తీస్తుంది. అయితే మటన్ విషయంలో ఈ నష్టాలు తక్కువ.  కొన్ని అధ్యయనాలు మేక మాంసంలో ఎక్కువ పోషకాలు ఉంటాయని సూచిస్తున్నాయి. ఇందులో సోడియం కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. అందువల్ల మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. అయితే, మీకు రక్తంలో చక్కెర సమస్య ఉంటే తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించండం మంచిది. తాజా పరిశోధనల ప్రకారం, చికెన్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటుంది. చికెన్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదని నమ్ముతారు. చికెన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇనుము, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు, B, A, D వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల చికెన్ గురించి చెప్పుకోవాలంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చికెన్ ఒక గొప్ప ఎంపికగా మారుతుంది. చికెన్ చాలా తక్కువ కొవ్వుతో ప్రోటీన్‌కు అధికంగా ఉంటుంది. ఎవరైనా చికెన్‌ని ఆరోగ్యకరమైన రీతిలో ఉడికించి తింటే, అది ఆరోగ్యకరమైన ఎంపికగా మారవచ్చు.

No comments:

Post a Comment