కమలం గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి ?

Telugu Lo Computer
0


తెలంగాణాలో గతంలో కంటే బలం పుంజుకున్న బీజేపీ మరింతగా బలపడటానికి వచ్చే ఏ అవకాశాలను కూడా వదులుకోవటంలేదు. ఏ పార్టీ నుంచి ఏ నేత బీజేపీలో చేరటానికి వచ్చినా చక్కగా కలిపేసుకుంటోంది. దీంట్లో భాగంగానే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కమలం గూటికి చేరుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కొండా బీజేపీలోకి చేరటం ఖరారు అయిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర మహబూబ్ నగర్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో కొండావిశ్వేశ్వర్ రెడ్డి వెళ్లి బండిని కలిశారు. వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. దాని కంటే ముందు ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డిని ఆయన ఇంట్లో విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరువురు దాదాపు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు. ఈ సమావేశం అనంతరం వీరిద్దరు కలిసి బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు సంభాషణలు జరిగాయి. ప్రజా సంగ్రామ యాత్ర చాలా చక్కగా సాగుతోందని ఈ సందర్భంగా కొండా కితాబిచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వీరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆయన బీజేపీ చేరడం ఇక ఖాయమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్న క్రమంలో కొండా బీజేపీలో చేరటం ఖరారు అయిపోయింది. తరుణ్‌చుగ్, బండి సంజయ్‌తో 45 నిమిషాలపాటు సమావేశమైన కొండా కాషాయ కండువా కప్పుకోవటమే తరువాయిగా ఉంది.కొండాను బీజేపీ తెలంగాణ నేతలు నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడించారు. ఇక మంచి ముహూర్తం చూసుకుని కాషాయ కండువా కప్పుకోవటమే తరువాయిగా ఉంది. మంచి రోజు చూసుకొని రెండు రోజుల్లో నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాగా..బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా జూలై 2, 3 తేదీల్లో మోదీ హైదారాబాద్‌లోనే ఉంటారు. మోదీతోపాటు ఇతర బీజేపీ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నగరానికి రానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతోపాటు కీలక నేతలు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఈ సందర్భంగా నడ్డా సమక్షంలో కొండా బీజేపీలో చేరనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)