ఇ-మ్యాండేట్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లిమిట్‌ పెంపు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 8 June 2022

ఇ-మ్యాండేట్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లిమిట్‌ పెంపు

 


క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్  విషయంలో రికరింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రతీ నెలా చెల్లింపుల కోసం ఇ-మ్యాండేట్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ లిమిట్‌ను ఆర్‌బీఐ పెంచింది. ప్రస్తుతం రూ.5,000 గా ఉన్న లిమిట్‌ను రూ.15,000 చేసింది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల్ని ఆర్‌బీఐ విడుదల చేయనుంది. ఇ-మ్యాండేట్ రికరింగ్ పేమెంట్స్‌కు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ తప్పనిసరి. కస్టమర్లకు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. కస్టమర్లు ఆథెంటికేట్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ లేకుండానే పేమెంట్ పూర్తయ్యేలా ఆర్‌బీఐ మార్పులు చేస్తోంది. చాలావరకు బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ సదుపాయం ఉపయోగించుకుంటున్న కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. ఇప్పటివరకు 6.25 కోట్ల మ్యాండేట్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం రూ.5,000 గా ఉన్న లిమిట్ పెంచాలని బ్యాంకుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఇన్స్యూరెన్స్ ప్రీమియం, పిల్లల స్కూల్ ఫీజు, ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కోసం లిమిట్ పెంచాలని బ్యాంకులు కోరాయి. బ్యాంకుల అభ్యర్థనలతో ఆర్‌బీఐ లిమిట్‌ను రూ.15,000 కి పెంచింది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తున్నారనుకుందాం. లేదా ఏదైనా ఇన్స్యూరెన్స్ కోసం ప్రతీ నెలా కొంత డబ్బులు చెల్లిస్తున్నారనుకుందాం. ఇలాంటి పేమెంట్స్ మీరు ప్రతీ నెలా తప్పకుండా చేయాల్సిందే. అయితే ప్రతీ నెలా ఒకే తరహా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకొని ఆ పేమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అందుకు సంబంధించిన ఇ-మ్యాండేట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఇ-మ్యాండేట్ క్రియేట్ చేసి మీరు ప్రతీ నెలా ఏ తేదీన ఎంత పేమెంట్ చేయాలో వివరాలు వెల్లడించాలి. ప్రస్తుతం గరిష్టంగా రూ.5,000 వరకు ఇమ్యాండేట్ క్రియేట్ చేయొచ్చు. ఆర్‌బీఐ తాజాగా రూ.15,000 కి పెంచింది. మీరు ఇ-మ్యాండేట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతీ నెలా మీరు సూచించిన తేదీలో డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి లింక్ చేయనుంది. రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి లింక్ చేస్తే మీరు మీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ప్రస్తుతం కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ మాత్రమే యూపీఐకి లింక్ అయ్యాయి.

No comments:

Post a Comment