సత్యేంద్ర జైన్‌ ఇంట్లో ఈడీ సోదాలు

Telugu Lo Computer
0


హవాలా కేసులో అరెస్టయిన దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జైన్‌కు చెందిన నివాసం, ఇతర కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కేసుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అరెస్టు చేసింది. జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్‌ 9వ వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)