వేలంలో 43 లక్షల అమ్ముడుపోయిన మహీంద్రా థార్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 7 June 2022

వేలంలో 43 లక్షల అమ్ముడుపోయిన మహీంద్రా థార్


కేరళలోని గురువాయుర్ ఆలయానికి చెందిన రెడ్ కలర్ లిమిటెడ్ ఎడిషన్ మహీంద్రా థార్ వాహనానికి రెండవ సారి వేలం నిర్వహించారు. ఆ వేలంలో థార్ వాహనం 43 లక్షలకు అమ్ముడుపోయింది. మల్లాపురంకు చెందిన భక్తుడు ఒకరు దీన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఎన్ఆర్ఐ అమల్ మొహమ్మద్ అలీ దీన్ని సొంతం చేసుకున్నారు. ఆ వేలంలో ఈ వాహనాన్ని 15 లక్షలకు అలీ గెలుచుకున్నారు. అప్పుడు అలీ ఒక్కడే వేలంలో పోటీపడ్డారు. కానీ దేవస్థానం బోర్డు ఈ వాహనాన్ని అతనికి అప్పగించేందుకు ఇష్టపడలేదు. ఈ అంశంలో కేరళ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కారుకు మళ్లీ వేలం నిర్వహించాలని కోర్టు తేల్చింది. దీంతో సోమవారం మళ్లీ ఆ రెడ్ కలర్ థార్‌కు వేలం వేశారు. ఈ సారి 15 మంది బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. దుబాయ్‌కు చెందిన విఘ్నేశ్ విజయ్‌కుమార్ 43 లక్షలకు థార్‌ను సొంతం చేసుకున్నారు. తన తల్లిదండ్రుల కోసం థార్ ఎస్‌యూవీని గెలుచుకున్నట్లు విజయకుమార్ తెలిపారు.

No comments:

Post a Comment