40 ఏళ్లుగా ఇసుకే ఆహారం

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని గంజాం జిల్లా కీర్తిపూర్ గ్రామానికి చెందిన హరిలాల్‌ భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు.హరిలాల్ కు ఇసుక అంటే చాలా ఇష్టం. మనం అన్నంతిన్నట్లుగా గత నలబైఏళ్లుగా ఇసుకను తింటున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని అరంగాపూర్ లో పుట్టిన హరిలాల్ కు ప్రస్తుతం 68ఏళ్లు.. అతడికి చిన్నతనం నుండే ఇసుక తినడం అలవాటు. హరిలాల్ మెత్తటి ఇసుక దొరికితే లొట్టలేసుకొని తినేస్తాడు. అతని గ్రామానికి దగ్గరలోనే నది ఉండటం వల్ల ప్రతీరోజూ ఆ నది దగ్గరికి వెళ్లడం ఇసుక తినడం అతనికి అలవాటుగా మారింది. వర్షాకాలం వస్తుందంటే హరిలాల్ ముందే అలర్ట్ అవుతాడు. నదిలోకి వరదనీరు వచ్చి ఇసుక దొరకదన్న ఉద్దేశంతో రెండు మూడు నెలలకు సరిపడా ఇసుక బస్తాల్లో నింపుకొని తీసుకొచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటాడు.  ఒకప్పుడు విపరీతంగా ఇసుకను తినే ఆయన.. ప్రస్తుతం కాస్త తగ్గించాడట. ఇసుక తిన్న తర్వాత కొంచెం అసౌకర్యంగా ఉంటుందని, కానీ ఇప్పటి వరకు నేను ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని హరిలాల్ చేబుతున్నాడు. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు, తరువాత గ్రామస్తులు, తోటి కూలీలు ఎన్నిసార్లు ఇసుకను తినడం మానమని ఒత్తిడి తెచ్చినా హరిలాల్ మాత్రం ఇసుకే నా ప్రాణం అన్నట్లుగా ఇప్పటికీ ఇసుకను తింటూనే ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)