టీ20 ప్రపంచకప్‌ లో చోటు దక్కని కోహ్లీ

Telugu Lo Computer
0


వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా వెలుగొందుతూ టెస్ట్, వన్డే, టీ20 అన్ని ఫార్మెట్స్ లో కోహ్లీ రికార్డ్స్ టాప్ లో ఉన్నాయి. అయితే గత కొద్దికాలంగా ఫార్మ్ కోల్పోవటం.. కెప్టెన్సీ నుండి దింపేయటం వంటి అంశాలు కోహ్లీ క్రేజ్ ని కాస్త తగ్గించినా ఇప్పటికి లెజండరీ క్రికెటర్ గా వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కోహ్లీ. అయితే అలాంటి ఈ క్లాస్ బ్యాట్స్ మెన్ కి ఇండియన్ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ షాక్ ఇచ్చాడు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టాప్‌ 3 బ్యాటర్లను ఎన్నుకున్న వీరు కోహ్లీకి ఈ లిస్టులో ఛాన్స్ ఇవ్వలేదు. ఈ మెగా టోర్నీ టాప్‌ త్రీలో ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అనూహ్యంగా మూడో స్థానంలో భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లికు సెహ్వాగ్ చోటువ్వలేదు. "భారత జట్టులో చాలా మం‍ది హార్డ్ హిట్టర్‌లు ఉన్నారు. కాబట్టి మ్యాచ్‌ ఫినిషింగ్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక టీమిండియా బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. టాప్‌3లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్‌ రాహుల్‌ ఉండాలని భావిస్తున్నాను. రోహిత్‌ శర్మ, కిషన్‌ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది. ఇక కిషన్‌తో పాటు రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చినా జట్టుకు మంచి ఆరంభం లభిస్తుంది" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)