కోలీవుడ్ ప్రముఖ నటుడు పూ రాము మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 June 2022

కోలీవుడ్ ప్రముఖ నటుడు పూ రాము మృతి


కోలీవుడ్ ప్రముఖ నటుడు పూ రాము కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయిన పూ రాము సాయంత్రానికి తుది శ్వాసవిడిచారు. పూ రాము మరణం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు, కోలీవుడ్ సెలెబ్రిటీలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కోలీవుడ్‌లో కమర్షియల్‌ చిత్రాలతో పాటు సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు.. కుల వివక్షకు సంబంధించిన చిత్రాలు ఎక్కువగానే వస్తుంటాయి. ఇలాంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తూ పూ రాము ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రం ఏంటంటే ఆయన అసలు పేరు రాము. కానీ పూ అనే చిత్రంలో ఆయన పాత్రకు మంచి పేరు రావడంతో.. ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా స్థిరపడింది. ఇక పూ చిత్రంలో ఆయన నటన అద్భుతం అని.. ఆ పాత్రలో ఆయనను తప్ప వేరొకరని ఊహించుకోలేమని నెటిజనులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రూ (ఆకాశం నీ హద్దురా), ధనుష్ కర్ణన్ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఆకాశం నీ హద్దురా చిత్రంలో సూర్యకు తండ్రిగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు ఆయన మరణంతో నాటి వీడియోలన్నీ ట్రెండ్ అవుతున్నాయి. సూర్యతో ఉన్న అనుబంధం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సూర్య నటన గురించి ఆయన గొప్పగా చెప్పిన మాటలు ఇప్పుడు ట్విట్టర్‌లో మార్మోగిపోతోన్నాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని సూర్య అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

No comments:

Post a Comment