దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో  రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, తెలంగాణ, హర్యానాలో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క ముంబై లోనే 60 శాతం కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 88,284 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.20 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటి రేటు 4.32 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,33,62,294 కరోనా కేసులు, 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 13,029 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,27,49,056 మంది కోలుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)