వందేళ్ల వృద్ధుడు - అయినా పనిలో సమర్ధుడు !

Telugu Lo Computer
0


ఎడిన్‌బర్గ్‌కు చెందిన డేవిడ్ ఫ్లకర్ అనే 100 ఏళ్ల వృద్ధుడు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వారానికి మూడు రోజులు స్వచ్ఛందంగా పనిచేస్తున్నాడు. జూన్ 22న ఆయన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇప్పటికీ వారానికి మూడు రోజులు స్వచ్ఛందంగా సేవ చేసే ఈ 100 ఏళ్ల వృద్ధుడి కథ చాలా మందిని ఆశ్చర్యపరిచింది.  డేవిడ్ ఫ్లకర్ తన వైఖరితో చాలా మందిలో స్ఫూర్తిని నింపాడు. సెయింట్ కొలంబస్ హాస్పైస్ కేర్ షాప్‌లో ఆయన వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. వారానికి మూడు రోజుల పాటు జిగ్సా ముక్కలను లెక్కించడం, బొమ్మలు సరిచేయడం, బట్టలకు ఆవిరిపట్టడం, కస్టమర్‌లతో మాట్లాడడం లాంటి విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయన 100వ జన్మదినం సందర్భంగా ఆ షాప్ యాజమాన్యం అతని జీవితం గురించే తెలిపే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేసి అతనికి అంకితం చేసింది. ఓషన్ టెర్మినల్ షాపింగ్ సెంటర్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ వైరల్ అయింది. అందులో ఆయన గురించి వివరించారు. ఆయన న్యూహెవెన్‌లో జన్మించారని.. తన జీవిత కాలంలో డేవిడ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో నివసించాడని వివరించారు. వందేళ్లు దాటినా పని మానేయాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఈ జీవితం ఇతరులకు సేవ చేసేందుకేనని ఆయన చెప్పాడని వివరించారు. ఫేస్‌బుక్‌లో ఈ ఫోస్ట్‌ను చూసిన వారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు డేవిడ్. మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు, గొప్ప రోల్ మోడల్” అంటూ అభినందించారు. “హ్యాపీ బర్త్ డే వావ్ అద్భుతం” అని మరొకరు పోస్ట్ చేసారు. "ఎంత అపురూపమైన మనిషి. హ్యాపీ బర్త్ డే డేవిడ్!” మరొకరు శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్ల వయసులోనూ పనిచేస్తూ ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)