నెలలో 14 లక్షల మంది చార్ ధామ్ దర్శనం

Telugu Lo Computer
0


మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాగా, భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు. 2019లో 7 నెలల పాటు సాగిన చార్ ధామ్ యాత్రలో 34 లక్షల మంది భక్తులు హాజరైన రికార్డు ఉంది. ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్లపాటు పాక్షిక యాత్ర మాత్రమే నిర్వహించారు. ఈక్రమంలో రెండేళ్ల అనంతరం పూర్తి స్థాయిలో చార్ ధామ్ యాత్ర ప్రారంభించారు ఉత్తరాఖండ్ అధికారులు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకోగా..ఇప్పటికే 14 లక్షల మందికి పైగా యాత్రకు వచ్చారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి ధామ్‌లకు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే భారీ వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో తొలిసారిగా కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే మార్గంలో పాదచారుల కారణంగా రహదారి మార్గం మూసుకుపోయింది. అదే సమయంలో, ప్రతికూల పరిస్థితులు, భక్తుల అనారోగ్య కారణాల వలన యాత్రకు వచ్చిన భక్తుల్లో 125 మంది మృతి చెందారు. ఇక యాత్రకు వస్తున్న వారిలో అత్యధిక మంది భక్తులు తమ బస ఏర్పాట్లను వెల్లడించడంలేదు. అధికారుల అంచనా ప్రకారం యాత్రకు వచ్చే పర్యాటకులు హోటళ్లు, హోమ్‌స్టేలలో బుకింగ్ చేయడం లేదు. ఎక్కడా బస ఏర్పాటు చేయకపోతే ప్రయాణం మానుకోవాలని అధికార యంత్రాంగం ఇప్పటికే స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)