కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 135 తగ్గింది !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 19 కిలోల కమర్షియల్ వంట గ్యాస్‌పై రూ.135 తగ్గించారు. ఎల్‌పీజీ సిలిండర్ల ధర తగ్గింపు ని!యం ఆహార ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుందని భావించవచ్చు.  ఢిల్లీలో 19 కిలోల LPG ట్యాంక్ ఇప్పుడు రూ. 2వేల 354 నుండి రూ. 2వేల 219 అవుతుంది. ముంబైలో ప్రజలు రూ.2వేల 306కి బదులగా రూ.2వేల 171.50 చెల్లించాల్సి ఉంటుంది. కోల్‌కతాలో రూ.2వేల 454 నుంచి రూ.2వేల 322కి, చెన్నైలో రూ.2వేల 507 నుంచి రూ.2వేల 373కి తగ్గనుంది. 14.2-కేజీల సిలిండర్ అయిన దేశీయ ఎల్‌పీజీ రేటులో ఎటువంటి మార్పు లేదు. గతంలో మే 1న కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.100 పెరగగా.. అంతకుముందు ఏప్రిల్‌ 1న సిలిండర్ ధర రూ.250, మార్చి 1న రూ.105 పెరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నెలవారీగా మార్పులు జరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో గత నెలలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.8 తగ్గించగా, డీజిల్‌పై లీటరుకు రూ.6 తగ్గించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)