దేశంలో 12,781 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో నిన్న 2,96,500 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 12,781 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 4,004, ఢిల్లీలో 1,530, కేరళ రాష్ట్రంలో 2,786 కేసులు నమోదయ్యాయి. రోజువారి పాజిటివిటీ రేటు 4.32శాతంకు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  కొవిడ్ తో చికిత్స పొందుతూ 18 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,24,873కు చేరింది. 8,537 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 76,700గా ఉన్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం 2,80,136 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో దేశంలో మొత్తం టీకాల పంపిణీ సంఖ్య 196.18 కోట్లకు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)