కోవై, మదురై జైళ్లలో ఖైదీల ఘర్షణ

Telugu Lo Computer
0


తమిళనాడులోని కోయంబత్తూరు, మదురై సెంట్రల్‌ జైళ్లలో సోమవారం ఉదయం ఖైదీలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు సెంట్రల్‌ జైలులో సుమారు 2వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిలో ఓ ఖైదీ రెండు రోజులకు ముందు జైలులో సెల్‌ఫోన్‌ వాడుతుండటాన్ని చూసిన మన్సూర్‌ మరో ఖైదీ ఆ విషయాన్ని జైలు వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్‌, అన్నపాండి, షేక్‌ మహమ్మద్‌, మునియాండి, ప్రవీణ్‌కుమార్‌ అనే ఖైదీలు మన్సూర్‌పై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఈ ఐదుగురు ఖైదీలు మన్సూర్‌, అతడి సహచరులతో ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో మన్సూర్‌ తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు రేస్‌కోర్స్‌ పోలీసులు ఐదుగురు ఖైదీలపై కేసు నమోదు చేశారు. మదురై సెంట్రల్‌ జైలులో గంజాయి కోసం ఖైదీలు ఘర్షణ పడ్డారు. దినేష్‌, నితీష్, ఆమర్‌, ప్రకాష్‌రాజ్‌ అనే ఖైదీలు సయ్యద్‌ ఇబ్రహీం అనే మరో ఖైదీ వద్దకు వెళ్లి గంజాయి కావాలని అడిగారు. తనకు గంజాయి అలవాటు లేదని, తనవద్ద లేదని సయ్యద్‌ ఇబ్రహీం చెప్పినా పట్టించు కోకుండా అతడిపై దాడి జరిపారు. గాయపడిన సయ్యద్‌ ఇబ్రహీం ను జైలు సిబ్బంది అక్కడి ప్రాంగణంలోనే ఉన్న ఆస్పత్రికి తరలించారు. మదురై నగర పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)