విశ్వనాథుడి మందిరం గేటు దగ్గర నమాజ్ చేసిన మహిళ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 6 May 2022

విశ్వనాథుడి మందిరం గేటు దగ్గర నమాజ్ చేసిన మహిళ


కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గర ఓ ముస్లిం మహిళ నమాజ్ చేయడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. గేట్ నెంబర్ 4 దగ్గర చాలా సేపు ఆమె నమాజ్ చేసింది. ఆమెను అక్కడి నుంచి పంపడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. చివరికి ఆమెను అక్కడి నుంచి పక్కకు తప్పించి, తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ విషయంపై ఎవరూ ఆందోళన వ్యక్తం చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మహిళ పేరు అయిషా. ఆమె జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళ. అయితే ఈ మహిళ మానసిక స్థితి ఏ మాత్రం బాగో లేదని పోలీసులు పేర్కొంటున్నారు. జ్ఞాన్‌వ్యాపి మసీదు దగ్గర శుక్రవారం ప్రార్థనలు నిర్వహిస్తారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున ముస్లింలు చేరుకున్నారు. ఇక విశ్వనాథుడి దర్శనానికి కూడా అంతే స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగింది.

No comments:

Post a Comment