విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోండి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 6 May 2022

విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోండి !


జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన జీఐటీఓ కన్నెట్ 2022 బిజినెస్ మీట్‌ను వీడియో లింక్ ద్వారా శుక్రవారం ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, నేడు మన దేశం సాధ్యమైనంత వరకు ప్రతిభ, వ్యాపారం, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. భారత దేశంలో  స్టార్టప్‌ కల్చర్  పెరిగిందన్నారు. మన దేశంలో ప్రతి రోజూ డజన్ల కొద్దీ స్టార్టప్ కంపెనీలు నమోదవుతున్నాయన్నారు. వారానికి ఓ యూనికార్న్ ఏర్పడుతోందని చెప్పారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్నారు. ఎగుమతుల కోసం నూతన అవకాశాలను గుర్తించాలని కోరారు. ఈ అంశాలపై స్థానిక మార్కెట్లలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఉత్పత్తుల్లో లోపాలు ఉండకూడదని, పర్యావరణంపై ఎంతమాత్రం ప్రభావం చూపకూడదని చెప్పారు. స్వయం సమృద్ధ భారత దేశం కోసమే తన ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇది దృఢ సంకల్పమని చెప్పారు. ప్రభుత్వ ప్రక్రియలు పారదర్శకంగా మారాయన్నారు. ప్రభుత్వానికి దృఢ నిశ్చయం, ప్రజల మద్దతు ఉంటే మార్పు అనివార్యమని తెలిపారు. జీఐటీఓ యువ సభ్యులు సృజనశీలురని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని, ప్రకృతి సేద్యంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. శూన్య వ్యయ బడ్జెట్‌తో ప్రకృతి సేద్యంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, సాగు సాంకేతిక పరిజ్ఞానం, సర్క్యులర్ ఎకానమీలలో మదుపు చేయాలని చెప్పారు. రీసైకిలింగ్, పునర్వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య సంరక్షణలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన జోయీమ్ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్‌లో దాదాపు 40 లక్షల మంది రిజిస్టర్ చేయించుకున్నారని, ఈ పోర్టల్‌ను అధ్యయనం చేయాలని జీఐటీఓ ప్రతినిధులను కోరారు. దీనిలో రిజిస్టర్ చేయించుకున్నవారిలో అత్యధికులు స్వయం సహాయక బృందాలు, చిన్నతరహా, మధ్య తరహా వ్యాపారవేత్తలేనని చెప్పారు. ఈ కొత్త విధానంపై ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నవారు, చిన్న దుకాణదారులు, స్వయంసహాయక బృందాలు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించవచ్చునని తెలిపారు. ప్రపంచం ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో భారత దేశం వైపు చూస్తోందన్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమని చెప్పారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళకు సంబంధించిన పరిష్కారాలు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల బలోపేతం వంటివాటి కోసం భారత దేశం అనుసరిస్తున్న విధానాలను ప్రపంచం ఆమోదిస్తోందని చెప్పారు.

No comments:

Post a Comment