శోభన్ బాబు ఆస్తుల విలువ ఎంత ?

Telugu Lo Computer
0


హీరో శోభన్ బాబు కు  సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. తెలుగు చిత్రం పరిశ్రమలో అందగాడు శోభన్ బాబు. అందరికీ ఒక నటుడిగానే తెలుసు కానీ ఆయన పెద్ద  బిజినెస్ మేన్ అన్న విషయం ఎవరికీ తెలియదు. ప్రతి రూపాయి భూమ్మీద పెట్టేవాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న వారు కూడా తెలుగు చిత్రం పరిశ్రమలో ఉన్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ శోభన్ బాబు గురించి మాట్లాడడం జరిగింది. మద్రాసులో అప్పట్లో ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పుడు కొన్ని వేల ఎకరాలు తీసుకున్నారట. అయితే ఇప్పుడు అన్ని లెక్కలు వేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని తెలియజేశాడు. అంతే కాకుండా ఆయన మరణించే సమయానికి ఆయన ఆస్తి విలువ దాదాపుగా రూ.80 వేల కోట్ల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. 1976లో కొన్ని మేజర్ కంపెనీలలో షేర్స్ తీసుకున్నాడు శోభన్ బాబు.  అలా తీసుకోవడమే కాకుండా కొన్ని చోట్ల స్థలాలు కొన్ని వేల ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇక మోహన్ బాబు స్పూర్తితోనే తన రియల్ ఎస్టేట్ లోకి అడుగు పెట్టానని మురళీ మోహన్ తెలిపారు. మనం భూమి పై పెట్టిన డబ్బు ఎక్కడికీ పోదని తన స్నేహితులకు చెప్పేవాడని ఆయన తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే ఆయన ఆస్తి విలువ ఎంతో తెలుసుకోండి అంటూ ఆయన తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఇంతటి ఆర్ధిక  బలం కలిగిన నటుడు ఎవరు లేరని మురళీమోహన్ తెలియజేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)