గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నగ్నంగా మహిళ ఆందోళన

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద ఓ మహిళ నగ్నంగా ఆందోళనకు దిగడం కలకలం రేపింది. గీతా ఆర్ట్స్‌ నుంచి తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలంటూ మహిళా ఆర్టిస్ట్‌ ధర్నా చేసింది. గతంలోనూ ఈ మహిళ ఫిలిం ఛాంబర్‌, బంజారాహిల్స్‌ పీఎస్‌ ఎదుట ఆందోళన చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని గీతా ఆర్ట్స్‌ వద్ద నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ కన్నీళ్లు పెట్టుకుని రోదించింది.. ఆమె పరిస్థితిని చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)