నటి, మోడల్‌ షహనా అనుమానాస్పద మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 14 May 2022

నటి, మోడల్‌ షహనా అనుమానాస్పద మృతి


కేరళలోని కాసరగోడ్‌కు చెందిన నటి, మోడల్‌ షహనా (20)  కాసరగోడ్‌కు చెందిన షహనాకు సజ్జద్‌ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహమయ్యింది. పరాంబిల్‌ బజార్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి 11.30 గంటలకు వారి అపార్ట్‌మెంట్‌లోని కిటికీ ఊచలకు షహనా మృతదేహం వేలాడుతూ కనిపించింది. షహనా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇది హత్యేనని ఆరోపించారు. భర్త హింసిస్తున్నట్లు షహనా ఎప్పుడూ తనతో చెబుతుండేదని తల్లి ఆరోపించారు. షహనా ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షహనా భర్త సజ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరెలు, ఆభరణాల యాడ్‌లతో కేరళ ప్రజలకు మోడల్‌ షహనా సుపరిచితురాలు. నటిగా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే షహనా తుదిశ్వాస విడిచారు.


No comments:

Post a Comment