ఒకే యూనిట్‌తో రెండు సినిమాల పాటలు !

Telugu Lo Computer
0


నితిన్‌ వరుసగా రెండు సినిమాల్ని తన బ్యానర్‌లోనే చేస్తున్నాడు. `మాచర్ల నియోజక వర్గం` సినిమా సెట్స్‌పై ఉంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా ఒప్పుకొన్నాడు.ఇందులో శ్రీలీల హీరోయిన్‌. ఇప్పుడు షూటింగ్ కూడా మొదలైయింది.  విదేశాల్లో ఓ పాట పూర్తి చేసుకొచ్చింది. ఇటలీలో `మాచర్ల నియోజక వర్గం` పాటల చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఈ సినిమాకి సంబంధించి మూడు పాటలు తెరకెక్కించాలి. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఈ ఖాళీ సమయాన్ని కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో వక్కంతం సినిమాకి సంబంధించిన ఓ పాటని అక్కడ ఫినిష్ చేసేశాడు. శ్రీలీల, వక్కంతం వంశీ, డాన్స్ మాస్టర్‌, కెమెరామెన్‌లు మాత్రమే ఇండియా నుంచి వెళ్లారు. మిగిలినదంతా. `మాచర్ల` టీమే. అలా ఒక దేశంలో, ఒకే యూనిట్‌తో రెండు సినిమాలకు సంబంధించిన పాటల్ని నితిన్‌ పూర్తి చేశాడు. ఈ రెండు సినిమాలపై నితిన్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు నితిన్‌. `మాచర్ల` ఫుల్ మాస్ సినిమా అయితే, వక్కంతం వంశీది పూర్తి వినోదాత్మక చిత్రం. `కిక్‌`, `రేసుగుర్రం` స్థాయిలో వక్కంతం వంశీ కథ సిద్ధం చేశాడట. `మాచర్ల` పూర్తయిన వెంటనే వక్కంతం వంశీ సినిమాకి పూర్తి స్థాయి సమయం కేటాయించబోతున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)