హత్యకు దారితీసిన 'బ్లాక్‌ కరెన్సీ'

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సీటీ  సమత వసతిగృహం వెనుక జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కీలక నిందితులను అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. బీ రైల్వేన్యూకాలనీకి చెందిన రాజశేఖర్‌ ఓ ఫైనాన్స్‌ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి, పొరుగునే ఉండే షేక్‌ ఇషాక్‌కు మధ్య ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి. వీరిద్దరి మధ్య 'బ్లాక్‌ కరెన్సీ (ఈ నకిలీ కరెన్సీని ప్రత్యేక ద్రావణాల్లో ముంచితే దాదాపు ఒక రోజు పాటు అసలు నోట్లలా కనిపిస్తాయి)' వ్యవహారం లావాదేవీలున్నాయి. ఈ క్రమంలో విబేధాలు తలెత్తాయి. రాజశేఖర్‌ తనను మోసం చేశాడని భావించిన ఇషాక్‌, ఉమామహేశ్వరావు, కె.సురేష్‌లతో కలిసి అతన్ని హత్య చేయాలనుకున్నాడు. ఈనెల 16వ తేదీ రాత్రి రాజశేఖర్‌కు ఫోన్‌ చేసి సమతా వసతిగృహం వెనక్కి రమ్మన్నాడు. అతను రాగానే కళ్లలో కారం పొడి కొట్టి, రాయి, రాడ్‌తో గట్టిగా కొట్టి కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. ఇషాక్‌తో తన భర్తకు వివాదం ఉందని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతన్ని విచారించారు. నిందితులు నేరం అంగీకరించటంతో రిమాండ్‌కు తరలించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)