ఇండియన్ ఆయిల్ వేడుకలో 'పోర్న్ వీడియో'

Telugu Lo Computer
0


అస్సాం రాష్ట్రం తిన్సుకియా జిల్లాలో ఇండియన్ ఆయిల్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఓ వేడుక నిర్వహించారు. మిథనాల్ కలిపిన ఎం-15 పెట్రోల్ రకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర పెట్రోలియం సంస్థ ఇండియన్ ఆయిల్ అస్సాం నుంచి ప్రారంభించింది. ఈకార్యక్రమానికి కేంద్ర పెట్రోలియంశాఖా మంత్రి రామేశ్వర్ తెలి, అస్సాం కార్మిక మంత్రి సంజయ్ కిసాన్ మరియు పలువురు ఇండియన్ ఆయిల్ అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఎం-15 పెట్రోల్ రకానికి సంబంధించి ఉన్నతాధికారి ఒకరు స్టేజిపై ప్రసంగిస్తుండగా, వెనుకనే ఉన్న స్క్రీన్ పై అందుకు సంబందించిన వివరాలు వరుసక్రమంలో ప్రదర్శించారు. అయితే అదే స్క్రీన్ పై వెనుక భాగంలో “పోర్న్ వీడియో(శృంగార)” కూడా ప్లే అయింది. ఇది గమనించిన అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. ముందుగా స్క్రీన్ ను ఆపేసి, తప్పిదాన్ని సరిదిద్ది కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఈ ఘటనపై నిర్వాహకులు, ఇండియన్ ఆయిల్ సంస్థ స్థానిక అధికారుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిన్సుకియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఇండియన్ ఆయిల్ అధికారికి చెందిన మీటింగ్ ఐడి, పిన్ కోడ్ దొంగిలించి జూమ్ మీటింగ్ ద్వారా స్క్రీన్ లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి రామేశ్వర్ తెలి స్పందిస్తూ శృంగార వీడియో ప్రదర్శనపై తమ సిబ్బంది చెప్పారని, దీనిపై పూర్తి విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై టిన్సుకియా జిల్లా మేజిస్ట్రేట్.. మేజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మంజిత్ బర్కకటికి విచారణను అప్పగించారు. ఏప్రిల్ 30న జరిగిన ఈఘటన పోలీస్ విచారణ నేపథ్యంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)