ఆకాశం నుంచి కిందపడ్డ వింత వస్తువులు

Telugu Lo Computer
0


గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో ఆకాశం నుంచి కొన్ని రకాల వింత వస్తువులు ఊడిపడ్డాయి. గుజరాత్ లోని ఆనంద్‌ జిల్లాలోని దగ్జిపురా, ఖంభోలాజ్‌, రాంపుర్‌, ఖేడా జిల్లా భూమేల్‌ గ్రామాల్లో ఈ శకలాలు పడినట్లు ఆనంద్‌ జిల్లా డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ బీడీ జడేజా చెప్పారు. ఒకటిన్నర అడుగుల వ్యాసంలో ఉన్న ఈ వస్తువులు ఈ నెల 12, 13 తేదీల్లో కిందపడ్డాయి. వీటి వల్ల ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు. అదేవిధంగా వడోదర జిల్లాలోని సావ్లి గ్రామంలోనూ ఇలాంటి శకలాలనే గుర్తించారు. వీటిని పరిశీలన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు పంపించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)