బంగారు షాపులలో అక్షయ తృతీయ జోరు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 3 May 2022

బంగారు షాపులలో అక్షయ తృతీయ జోరు !


అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోళ్లు ఎక్కువ జరుపుతారు. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా లాక్‌డౌన్‌లు, ఆంక్షలు విధించడంతో బంగారం కొనుగోళ్లు మందగిచాయి. ఈ దఫా కొవిడ్ ఆంక్షలు లేకపోవటంతో పాటు రంజాన్ సెలవు దినం కావడంతో బంగారం విక్రయాలు అధికంగా జరిగినట్లు వర్తకులు పేర్కొన్నారు. 2020, 2021 సంవత్సరాల్లో కొవిడ్ ఆంక్షలు కారణంగా అక్షయ తృతీయ రోజు పెద్దగా విక్రయాలు జరగలేదు. అయితే 2019 సంవత్సరంలో నమోదైన గణాంకాలను మించి దేశంలో మంగళవారం గోల్డ్ విక్రయాలు జరిగాయని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సియామ్ మెహ్రా తెలిపారు. 2019 అక్షయ తృతీయతో పోల్చితే ప్రస్తుతం 10శాతం అధికంగా విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్షయ తృతీయతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కలిసొచ్చిందని గోల్డ్ షాపుల యాజమానులు తెలిపారు. మంగళవారం బంగారం దుకాణాలో సందడి వాతావరణం కనిపించింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వారుసైతం అక్షయ తృతీయరోజు సెంటిమెంట్ గా భావించి బంగారం కొనుగోళ్లు జరిపారు. దీంతో రెండేళ్ల తరువాత అక్షయ తృతీయ రోజు గోల్డ్ షాపులు కొనుగోలు దారులతో కళకళగా కనిపించాయి. మూడేళ్లలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 2021లో మొత్తం 39.3 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే, 2022లో మొదటి మూడు నెలల్లోనే 41.3 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2019 అక్షయ తృతీయ సందర్భంగా రూ.10,000 కోట్ల బంగారం అమ్మకం జరిగితే, 2020లో కోవిడ్ కారణంగా రూ.500 కోట్ల బంగారం మాత్రమే అమ్ముడైంది. ఈ ఏడాది మాత్రం రూ.15,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment