డెలివరీ బాయ్ చేసిన పనికి షాక్ !

Telugu Lo Computer
0


బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడితో జరిపిన వాట్సాప్ సంభాషణ ప్రకారం నగరంలోని ఒక ప్రముఖ కాఫీ షాప్ నుంచి ఆన్‌లైన్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా ఒక కాఫీ ఆర్డర్ చేశాడు. కాఫీ షాప్ సిబ్బంది ఆ ఆర్డర్‌ను అంగీకరించగా ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడకు వెళ్ళాడు. కాఫీ పార్సెల్ తీసుకున్న బాయ్ ఆ ఒక్క చిన్న డెలివరీ కోసం వినియోగదారుడి లొకేషన్ వరకు ఏం వెళ్ళాలి అనుకున్నాడో మరి మరో డెలివరీ యాప్ డుంజో ద్వారా ఆ కాఫీని సదరు వినియోగదారుడికి పార్సెల్ చేశాడు. అనంతరం వినియోగదారుడికి కాల్ చేసిన స్విగ్గి డెలివరీ బాయ్ 'సార్ మీ పార్సెల్‌ను డుంజోలో పంపించాను నాకు మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి' అంటూ విజ్ఞప్తి చేశాడు. స్విగ్గిలో ఆర్డర్ చేసిన తన కాఫీ, డుంజో డెలివరీ బాయ్ తీసుకురావడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని తన మిత్రుడితో వాట్సాప్ ద్వారా పంచుకోగా..ఆ సంభాషణ తాలూకు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు  స్విగ్గీ డెలివరీ బాయ్ అతి తెలివిని ప్రశంసించడం గమనార్హం. బెంగళూరులో వ్యవహారాలు ఇలా పీక్స్‌లోనే ఉంటాయి మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)