ఢిల్లీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 5 May 2022

ఢిల్లీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు


తూర్పు ఢిల్లీలోని భజన్‌ఫూర్‌లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో తరగతి గదిలోకి చొరబడిన యువకుడు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారి ముందే మూత్ర విసర్జన చేశాడు. అయితే ఈ విషయం గురించి బాధితులు స్కూల్‌ ప్రిన్సిపల్‌, క్లాస్‌ టీచర్‌కు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదని విద్యార్థులు వెల్లడించారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పోలీసులు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. నిందితుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.

No comments:

Post a Comment