కాశ్మీర్‌ పండిట్ల పిల్లలకు ఉచిత విద్య !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని ఓ విద్యా సంస్థ కాశ్మీర్‌ పండిట్ల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించింది. కశ్మీర్‌ నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారి పిల్లలకు ఈ అవకాశం కల్పించారు. 90వ సంవత్సరంలో జరిగిన మారణ హోమానికి తన ఫ్యామిలీని కోల్పోయిన కాశ్మీరీ పండిట్ కుటుంబం జీవితం చుట్టూ ది కాశ్మీర్ ఫైల్స్ కథ తిరుగుతుంది. ఈ చిత్ర బృందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అటు కొందరు మాత్రం ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తాజాగా కాశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని నట్టోజ ఫౌండేషన్‌ కార్యదర్శి సుబ్రమణ్య నట్టొజ స్ఫూర్తిగా తీసుకున్నాడు. కాశ్మీర్‌ పండిట్ల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటన చేశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తురు టౌన్‌ లో ఉన్న అంబికా మహావిద్యాలయానికి సుబ్రమణ్య నట్టొజ కార్యదర్శిగా ఉన్నాడు. కాశ్మీర్‌ పండిట్ల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ విద్యాసంస్థలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందివ్వనున్నారు. అంతేకాదు విద్యార్థులు ఉండేందుకు ఉచితంగా హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. అటు ఇప్పటికే అంబికా మహావిద్యాలయంలో నలుగురు కాశ్మీర్‌పండిట్లు అడ్మిషన్‌ తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ విద్యా సంస్థలో చదువుకోవాలంటే ఒక్కో విద్యార్థికి కనీసం సంవత్సరానికి 80 వేలు ఖర్చు అవుతుంది. ఇతర సౌకర్యాల కోసం దాదాపుగా మరో 50 వేల వరకు ఖర్చు అవుతుంది. కాశ్మీర్‌ పండిట్ల పిల్లల కోసం ఈ ఖర్చంతా తామే భరిస్తామని సుబ్రమణ్య నట్టొజ ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)