ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్రమాదాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశాలు

Telugu Lo Computer
0


ఎలక్ట్రికల్ టూ వీలర్ వెహికల్స్ పేలళ్లలో  ప్రతి సంఘటనపై విచారణ జరిపించనున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల సెక్రటరీ గిరిధర్ అరమనే అన్నారు. భారతీయ EV పరిశ్రమ 'మన ఊహకు' మించి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఆర్థిక సంవత్సరం 2022లో రవాణా, రహదారుల మొత్తం ఆస్తి మానిటైజేషన్ విలువ సుమారు రూ. 21,000 కోట్లను సాధించినట్లు చెప్పారు. ఈ మధ్య ఎలక్ట్రిక్ బైక్‌లలో బ్యాటరీ ప్రమాదాలు తరచుగా జరుగుతుండడంపై స్పందిస్తూ.. వాహన తయారీ సంస్థలు సరైన రక్షణ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. 'బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల సేకరణ, డిజైన్, నిర్వహణ, కార్యకలాపాలు, తయారీని పరిశీలించాలి' అని అన్నారు. ఈ విషయమై నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే దీనిపై నివేదిక రావాల్సి ఉందని అన్నారు. ఈ మధ్య పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో పేలుడు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో పలువురు మరణించగా, మరి కొంత మంది గాయపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)