రాజ్యసభకు ఆర్‌. కృష్ణయ్య ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 17 May 2022

రాజ్యసభకు ఆర్‌. కృష్ణయ్య ?


త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా, అందులో ఒకటి బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి రావడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది. ఈ సారి విజయసాయిరెడ్డి, కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తుండగా ఇవాళ సాయంత్రంలోగా అభ్యర్థులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, ఈ పరిణామాలపై ఆర్‌. కృష్ణయ్య ఆనందం వ్యక్తం చేశారు. 


No comments:

Post a Comment