త్వరలో మద్యం హోం డెలివరీ ?

Telugu Lo Computer
0

 


ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రుల బృందం 'మద్యం హోం డెలివరీ' ప్రతిపాదనపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. అంతేకాదు.. రిటైర్ లిక్కర్ షాపులు మద్యం ధరలపై ఇచ్చే డిస్కౌంట్స్‌పై కూడా ఎలాంటి ఆంక్షలు విధించకూడదని మంత్రుల బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలోని మద్యం రిటైల్ షాపుల దగ్గర మందుబాబుల కారణంగా విపరీతమైన రద్దీ ఏర్పడుతూ ఉండటం, దుర్ఘటనలు జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ మద్యం హోం డెలివరీ ఆలోచన చేసింది. మందుబాబులకు ఇంటికే మద్యాన్ని హోం డెలివరీ చేస్తే ఏ గొడవా ఉండదని భావిస్తోంది. 'లిక్కర్ హోం డెలివరీ' ప్రతిపాదన త్వరలో ఢిల్లీ కేబినెట్‌ ముందుకు వెళ్లనుంది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ కూడా ఎక్కువ శాతం ఆమోదముద్ర వేసే అవకాశాలే ఉన్నాయి. ఈ విషయాన్నే మంత్రుల బృందం కూడా ధ్రువీకరించింది. Pandemic లేదా అత్యవసర పరిస్థితుల్లో.. లాక్‌డౌన్‌లు విధించాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు లిక్కర్ సరఫరాకు ఈ 'లిక్కర్ హోం డెలివరీ' ఆప్షనే ప్రత్యామ్నయం అని GoM భావించింది. హోం డెలివరీ ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలపగానే ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన నియమనిబంధనలు రూపొందించనుంది. 2021 జూన్‌లో ఢిల్లీ ప్రభుత్వం L-13 లైసెన్స్ ఉన్న మద్యం విక్రయదారులకు మాత్రమే మద్యం హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్‌ 2010, రూల్ నెం.66కు కట్టుబడి హోం డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం మద్యాన్ని కేవలం ఇంటికి మాత్రమే డెలివరీ చేస్తారు. హాస్టల్స్‌కు, ఆఫీస్‌లకు, మరే ఇతర ఇన్‌స్టిట్యూషన్‌కు డెలివరీ చేయరు.

Post a Comment

0Comments

Post a Comment (0)