ఎన్ఆర్ఐ దంపతుల దారుణ హత్య

Telugu Lo Computer
0


చెన్నైనగరంలోని మైలవరంలో ఎన్ఆర్ఐ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఎన్ఆర్ఐ దంపతులను ఫామ్ హౌస్ సిబ్బంది హత్య చేశారు. అనంతరం 50 కేజీల బంగారం, 5 కేజీల వెండి, రూ.20లక్షల నగదులో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను నేపాల్ కు చెందిన లాల్ శర్మ, కొడుకు లాల్ కృష్ణలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)