మద్యం ధరల్లో వ్యత్యాసాలు ?

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, మందు కంపెనీలు ప్రకటించిన ధరలలో వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో మందుబాబులకు, షాపుల నిర్వహకులకు మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. ధరలపై స్పష్టమైన విధానం లేకపోవడంతో షాపుల యాజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు. కారేపల్లి ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో పలుషాపుల్లో మద్యం రేట్లు మందుబాబులకు, షాపుల నిర్వాహకులకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఉదాహరణకు మూడురోజుల క్రితం ఈ ప్రాంత సీఐ ప్రభుత్వం ప్రకటించిన ధరలకు మద్యం విక్రయించాలని పెరిగిన ధరల జాబితా అందజేశారు. కొన్ని మద్యం కంపెనీలు ప్రకటించిన ధరలకు పొంతనలేకుండా పోతోంది. ఉదాహరణకు రాయల్‌గ్రీన్‌ ఫుల్‌ బాటిల్‌ను ఎక్స్తెజ్‌ శాఖ రూ.1040 విక్రయించాలని సూచించగా.. కంపెనీ నుంచి మాత్రం రూ.880కు విక్రయించాలని షాపులకు సూచించారు. ఆఫ్‌ బాటిల్‌కు ప్రభుత్వ ధర రూ.520 కాగా కంపెనీధర 460, అదే చీఫ్‌ లీటర్‌ బాటిల్‌ ప్రభుత్వ ధర రూ.610 కాగా, కంపెనీ ధర రూ.630గా నిర్ణయించడంతో షాపుల నిర్వాహకులు అయోమయానికి గురతున్నారు. గ్రామీణప్రాంతాల్లో ఎక్కువశాతం చిఫ్‌ లిక్కర్‌ అమ్మకాలు ఎక్కుగా ఉంటాయి. అనేక కంపెనీలకు సంబంధించిన మద్యం ధరలు ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, కంపెనీలు ప్రకటించిన ధరలకు వ్యత్యాసం ఉండటంతో అంతా అయోమయంగా మారడంతో పాటు ఘర్షణలకు దారితీస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)