గాయని సంగీత సజిత్‌ కన్నుమూత

Telugu Lo Computer
0


తమిళనాడుకి చెందిన ప్రముఖ దక్షిణాది భాషల సినిమాల్లో తన స్వరాన్ని అందించి ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన నేపథ్య గాయని సంగీత సజిత్‌ మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీసంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ సంగీత ఆదివారం ఉదయం కన్నుమూశారు. తిరువానంతపురం లోని తన సోదరి నివాసంలో సంగీత సజిత్ తుది శ్వాస విడిచారు. 46 సంవత్సరాల నేసంగీత సజిత్ తమిళ, కన్నడ,తెలుగు భాషల సినిమాల్లో పాటలు పాడారు. చనిపోయే ముందు వరకు ఆమె సుమారు 200పాటలు పాడారు. దక్షిణాది సినిమాల్లో ఆమె జోష్‌ నింపే పాటలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్ స్వరపరిచిన తమిళ సినిమా మిస్టర్ రోమియోలో తన్నెరై కథలిక్కుమా అనే పాట ఆమె కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్‌గా నిలిచి సంగీత సజిత్‌కు బాగా గుర్తింపు తెచ్చి పెట్టింది. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ నటించిన 'కురుతి' సినిమాలోని థీమ్ సాంగ్ సంగీత సజిత్ పాడిన చివరి పాట కావడం విశేషం.  కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఈ సూపర్ సింగర్‌ ఆకాల మరణ వార్త తెలిసి దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు దిగ్బ్రాంతి లోనయ్యారు.సింగర్ సంగీత సజిత్‌ మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)