ఈ తగ్గింపు ఎన్నికల కోసమేనా?

Telugu Lo Computer
0


త్వరలో గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసమే బీజేపీ ఈ తగ్గింపు నాటకమాడుతుందని విశ్లేషకులు అంటున్నారు. బారానా పెంచి.. చారానా తగ్గిస్తే తగ్గించినట్లా అని ప్రశ్నిస్తున్నారు. యూపీ ఎన్నికలకు ముందు లీటర్ పెట్రోల్ రూ. 114.49, డీజిల్ రూ. 109.49 పైసలుగా ఉంది. నవంబర్ 4న కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 సుంకాన్ని తగ్గించింది. దాంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20, డీజిల్ రూ. 94.62 పైసలకు చేరింది. అయితే ఈ రేట్లు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేదాకా స్థిరంగా ఉన్నాయి. సింగిల్ పైసా కూడా పెరగలేదు. కానీ, ఎన్నికలు ఫలితాలు కేంద్రానికి అనుకూలంగా రావడంతో మళ్లీ ఏప్రిల్ 6 నుంచి పెట్రో రేట్ల పెంపు మొదలైంది. నేటికి (21-05-22) లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49, డీజిల్ రూ. 105.49 లకు చేరింది. అంటే యూపీ ఎన్నికలకు ముందు పెట్రోల్ మీద తగ్గింది రూ.5, ఎన్నికల తర్వాత పెరిగింది రూ.11.29 పైసలు. అదేవిధంగా డీజిల్ మీద తగ్గింది రూ. 10, ఎన్నికల తర్వాత పెరిగింది రూ. 10.87 పైసలు. అంటే ఎన్నికల ముందు తగ్గించిన దానికంటే ఎన్నికల తర్వాత పెరిగిందే ఎక్కువ. ఇది క్రిస్టల్ క్లియర్ కనిపిస్తోంది. ఇక నేడు (21-05-22) తాజాగా కేంద్రం తగ్గించిన సుంకంతో లీటర్ పెట్రోల్ మీద రూ. 9.50 పైసలు, డీజిల్ మీద రూ.7 తగ్గింది. అంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెరిగిన రేట్ల పెంపు కంటే.. ఇవాళ కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం తక్కువే. ఎన్నికల తర్వాత లీటర్ పెట్రోల్ మీద రూ. 11.29 పైసలు పెంచి, ఇప్పుడు రూ.9.50 పైసలు తగ్గించారు. అలాగే లీటర్ డీజిల్ మీద రూ. 10.87 పైసలు పెంచి, ఇప్పుడు రూ.7 తగ్గించారు. దీనిని బట్టి చూస్తే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఉన్న రేట్ల కంటే పెట్రోల్ మీద రూ. 1.79 పైసలు, డీజిల్ మీద రూ.3.87 పైసలు ఎక్కువే చెల్లిస్తున్నాం. అటువంటప్పుడు ఇందులో భారీగా తగ్గింపులు ఎక్కడున్నాయ్. గ్యాస్ సిలిండర్ ధర విషయానికొస్తే రూ.450 ఉన్న ధరను క్రమక్రమంగా రూ.1055 చేశారు. తాజాగా గ్యాస్ ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ తగ్గింపు అందరికి కాదు. కేవలం ఉజ్వల స్కీం కింద కనెక్షన్ తీసుకున్న వాళ్లకే. ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవాళ్లు తెలంగాణ మొత్తంలో చాలా తక్కువ ఉంటారు. ఉజ్వల స్కీం కింద కనెక్షన్ తీసుకున్నోళ్లు మన తెలంగాణలో మండలానికి పది మంది కూడా ఉంటరో, ఉండరో! కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ ఎనిమిదేండ్లలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో రూ.26 లక్షల కోట్లకుపైగా ప్రజల నుంచి పిండుకొన్నది. ఒక్క 2021 సంవత్సరంలోనే ఏకంగా రూ.3.7 లక్షకోట్లు కేం ద్ర ఖజానాకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతం పెరిగి లీటర్‌ పెట్రోల్‌ రూ.120కి చేరటంతో కేంద్రానికి దాదా పు రూ. 4 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని ముం దస్తు అంచనాలున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్‌ డ్యూ టీ తగ్గింపువల్ల అందులో కోల్పోతున్న ఆదాయం రూ.లక్ష కోట్లు మాత్రమే. కేంద్రం తీరు ఎడమచేత్తో ఇచ్చి కుడిచేతితో లాగేసుకొన్నట్టు ఉన్నదని మార్కెట్‌ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్‌లో శనివారం లీటర్‌ పెట్రోల్‌ రూ.119.49, డీజిల్‌ రూ.105.49 ఉన్నది. తాజా తగ్గింపుతో ఆదివారం నుంచి లీటర్‌ పెట్రోల్‌ రూ.110, లీటర్‌ డీజిల్‌ రూ.99.49 ఉండనున్నది. ఎనిమిదేండ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికంటే తాజా రేట్లు భారీగానే ఉన్నాయి. 2014, మే 26న లీటర్‌ పెట్రోల్‌ 71.41, లీటర్‌ డీజిల్‌ రూ.55.49 మాత్రమే. అంటే నాటికి నేటికి ముడి చమురు ధరలో రెండు డాలర్లు మాత్రమే తేడా కానీ, పెట్రోల్‌ ధరలో దాదాపు రూ.30, డీజిల్‌ ధరలో దాదాపు రూ.44 తేడా ఉన్నది. ఈ విధంగా కేంద్రం సామాన్యుడి బతుకును చిధ్రం చేస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)